Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లిబియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్... ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి!

లిబియాలో ఇద్దరు భారతీయులు కిడ్నాపైన ఘటన వారి కుటుంబాల్లో కలకలం రేపుతోంది. లిబియాలోని ట్రిపోలీలో వారిద్దరినీ అపహరించినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఒకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్ కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొసనం రామ్మూర్తి. వీరిద్దరినీ బందీల నుంచి విడిపించేందుకు విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వారిద్దరినీ విడిపిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని వారు వెల్లడించారు.

More Telugu News